భద్రాద్రి కొత్తగూడెం- తెలంగాణలో ఓ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ పట్ల ఫారెస్ట్ గార్డ్ దారుణంగా ప్రవర్తించిన తీరుపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. అడవిలో కట్టెలు ఏరుకునేందుకు వెళ్లిన గిరిజన యువతిని ఫారెస్ట్ గార్డు బట్టలూడదీసి కొట్టిన దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అడవిలో కట్టెలు తెచ్చుకునేందుకు వెళ్లిన తమపై ఫారెస్ట్ గార్డు దాడి చేశాడని బాధితులు ఆరోపించారు. ఈ అమానుష ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంచలనంగా మారింది. […]