తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు సమ్మెసైరన్ మోగింది. రెండేళ్లుగా టాలీవుడ్ కరోనా సంక్షోభాన్ని ఎంత భారంగా ఎదుర్కొంది.. ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్న సమయంలో బయట మార్కెట్ ధరలు ఆకాశాన్ని అంటాయి. ఎన్నో ఎళ్లుగా ఇండస్ట్రీని నమ్ముకొని ఉద్యోగాలు చేస్తున్నామని.. తమకు మాత్రం వేతనాలు పెరగడం లేదని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ జీతాలు పెంచాలంటూ.. నిర్మాతల మండలిపై కొంత కాలంగా వత్తిడి తెస్తున్నారు. అయితే ఫెడరేషన్ కూడా కార్మికుల వేతనాల అంశాన్ని పెండింగ్ […]