తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు సమ్మెసైరన్ మోగింది. రెండేళ్లుగా టాలీవుడ్ కరోనా సంక్షోభాన్ని ఎంత భారంగా ఎదుర్కొంది.. ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్న సమయంలో బయట మార్కెట్ ధరలు ఆకాశాన్ని అంటాయి. ఎన్నో ఎళ్లుగా ఇండస్ట్రీని నమ్ముకొని ఉద్యోగాలు చేస్తున్నామని.. తమకు మాత్రం వేతనాలు పెరగడం లేదని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ జీతాలు పెంచాలంటూ.. నిర్మాతల మండలిపై కొంత కాలంగా వత్తిడి తెస్తున్నారు. అయితే ఫెడరేషన్ కూడా కార్మికుల వేతనాల అంశాన్ని పెండింగ్ పెడుతూ వస్తుంది. తమ వేతనాలు పెంచాలని రేపటి నుంచి ( జూన్ 22) నుంచి సమ్మే చేయాలని నిశ్చయించినట్లు సినీ ఇండస్ట్రీలోని 24 కీలక విభాగాల వాళ్లు ప్రకటించారు.
వేతనాలు పెంచాలని.. తమ డిమాండ్లు నెరవేర్చాలని సినీ కార్మికులు రేపటి నుంచి సమ్మే చేసేందుకు సిద్దమవుతున్నారు. అంతే కాదు రేపు ఫిలిం ఫెడరేషన్ ముట్టడికి 24 పిలుపుని ఇచ్చారు. తమ డిమాండ్లు నెరవేర్చి.. వేతనాలు పెంచే వరకు షూటింగ్స్ జరగవని తేల్చి చెప్పారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో శ్రమదోపిడి జరుగుతుందని యూనియన్ సభ్యులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు వేతనాలు పెంచే వరకు సహాయ నిరాకరణ చేస్తామని చెబుతున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.