మైకేల్ ప్యాకార్డ్ అనే వ్యక్తి సముద్రంలో లోబ్ స్టర్లు వేటాడుతుంటాడు. మసాచుసెట్స్ లోని ప్రావిన్స్ పట్టణంలో ఎప్పట్లాగానే సముద్రంలో లోబ్ స్టర్ల వేటకు వెళ్లాడు. తన సహచరుడితో కలిసి బోటులో సముద్రంలో కొంతదూరం వెళ్లి, ఆపై లోబ్ స్టర్ల కోసం సీ డైవింగ్ చేశాడు. ఆ దూకడంతో ప్యాకార్డ్ కు ఒక్కసారిగా ఏదో అగాథంలో పడిపోయిన భావన కలిగింది. కళ్ల ముందు చీకటి తప్ప ఏమీ కనిపించలేదు. అయితే, తనను ఆ ప్రాంతంలో ఎక్కువగా తిరిగే తెల్ల […]
ఒకప్పుడు ముసుగు వేసుకున్నా… మాస్క్ వేసుకున్నా హడలిచచ్చేవాళ్ళు ఇప్పుడు మాస్క్ వేసుకోకపోతే భయపడిచస్తున్నారు. 500 సంవత్సరాలుగా మాస్కులను ఉపయోగిస్తూనే వస్తున్నారు. ఒకప్పుడు నోటిని, ముక్కును కప్పేలా ఉండే మాస్కులతో బ్యాంకుల దోపిడీ చేసేవారు, ముసుగు మాస్క్ అంటే దొంగలేమో అనుకునే రోజులూ ఉన్నాయి. కానీ ఇప్పుడు కరోనా కాలంలో మాస్క్ ఎంత సాధారణం అయిపోయిందంటే, దానిని ‘నార్మల్’ అని చెప్పుకుంటున్నారు. మాస్క్‌లు ఉపయోగించడం కొత్తగా అనిపించినా అవి మనుషులకు అంత కొత్తేం కాదు. మనిషితో పాటు శతాబ్దాలుగా […]