కాలేజీలో కరెంటు లేక విద్యార్థులు కార్ల వెలుతురులో పరీక్ష రాసిన సంఘటన బిహార్లో జరిగింది. సిబ్బంది వైఫల్యం కారణంగా దాదాపు 400 మంది 12వ తరగతి(ఇంటర్మీడియట్) విద్యార్థులు కార్ల హెడ్ లైట్ల వెలుతురులో పరీక్ష రాశారు. ఈస్ట్ చంపారన్ జిల్లాలోని మోతిహరి పరిధిలో గల మహారాజా హరేంద్ర కిశోర్ సింగ్ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటి పరీక్ష హిందీని రెండు భాగాలుగా నిర్వహించారు. ఫస్ట్ పేపర్ పరీక్ష […]