పాకిస్తాన్ లో షెషావర్ పట్టణంలో ఉగ్రమూకలు రెచ్చిపోయారు. షెషావర్ లోని కిస్సా ఖ్వానీ బజార్ లో ని ఓ మసీదుపై ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. శుక్రవారం మసీదులో ప్రార్థనలు జరుగుతుండగా ఓ ఉగ్రవాది ప్రవేశించాడు. అక్కడ అందరు ప్రార్థనలో నిమగ్నమై ఉండగా ముష్కరుడు తనను తాను పేల్చుకున్నాడు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 30 మంది మృతి చెందారు.మరో 50 మందికి తీవ్రంగా గాయపడినట్లు పాకిస్తాన్ పోలీసు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్సను […]