గత కొంతకాలంగా ప్రపంచలోని అత్యున్నత పదవులను అలంకరిస్తున్నారు భారత సంతతికి చెందిన వ్యక్తులు. ఈ జాబితాలోకి మరో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి చేరాడు. అతడి పేరు అమిత్ క్షత్రియ. త్వరలో చేపట్టబోయే 'మూన్ టు మార్స్' ప్రయోగానికి సారథిగా నియమించింది నాసా. ఇక ఈ ఘనత సాధించిన తొలి భారతీయ వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు.