కొత్త ఏడాది వస్తోందంటే చాలు.. మనలో చాలామంది ఏవేవో తీర్మానాలు చేసేస్తుంటాం. జనవరి మొదలు ఇది చేసేద్దాం.. అది చేసేద్దాం అని ఎన్నో కలలు, దృఢ నిర్ణయాలు తీసుకుంటాం. అయితే వాటిల్లో 80 శాతానికిపైగా నిర్ణయాలు మొదటి నెల ముగిసేలోగానే అటకెక్కేస్తాయి. ఈ ఏడాదైనా అలాకానివ్వకండి. రాను.. రాను.. డబ్బుకు విలువ పెరుగుతోంది. చేతిలో రూపాయి లేకుంటే మనిషికి విలువ కూడా ఉండట్లేదు. ప్రపంచం అంతా డబ్బు చుట్టే తిరుగుతోంది. అందులోనూ ఆర్థిక కష్టాలు మనకు చెప్పిరావు. […]