MLA Balakrishna: సత్యసాయి జిల్లాలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. కార్యకర్త ఇంటికి వెళ్తుండగా ఆయన కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. కాన్వాయ్‌లో మూడు కార్లకు మాత్రమే అనుమతి ఇస్తామని చెప్పారు. దీంతో టీడీపీ కార్యకర్తలు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. కార్యకర్త కొడికొండ బాలాజీ ఇంటికి వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. కాగా, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు శత […]