MLA Balakrishna: సత్యసాయి జిల్లాలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. కార్యకర్త ఇంటికి వెళ్తుండగా ఆయన కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. కాన్వాయ్‌లో మూడు కార్లకు మాత్రమే అనుమతి ఇస్తామని చెప్పారు. దీంతో టీడీపీ కార్యకర్తలు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. కార్యకర్త కొడికొండ బాలాజీ ఇంటికి వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. కాగా, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు శత జయంతి వేడుకలు ఈ నెల 28న నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమాన్ని ‘శక పురుషుని శత జయంతి’ పేరిట నిమ్మకూరు నుంచి ప్రారంభించనున్నారు.
ఈ ఉత్సవాల్లో బాలయ్య బాబు పాల్గొననున్నారు. ఎన్టీఆర్, బసవతారకం కాంస్య విగ్రహాల వద్ద నివాలర్పించి వేడుకలు ప్రారంభిస్తారు. ఇందుకోసం శుక్రవారం సాయంత్రం నిమ్మకూరు చేరుకోనున్నారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు వివిధ దేశాల్లో ఏడాది పాటు కొనసాగనున్నాయి. మరి, బాలయ్య బాబు పర్యటనపై పోలీసుల ఆంక్షలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Konaseema: కోనసీమ ఘటన వెనుకున్నది అతడేనా.? వైసీపీ-జనసేన ఆరోపణలు?