దేశంలో లంచగొండితనం ఓ భయంకర అంటువ్యాధిలా ప్రబలిపోయింది. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేవారు నెల జీతాలు తీసుకుంటున్నా.. ప్రతి చిన్నపనికి లంచం కావాలని ప్రజలను పట్టిపీడిస్తున్నారు. ఎక్కడో ఒక్కరిద్దరు మాత్రమే లంచానికి ఆశపడకుండా పనును చేస్తున్నారు. అలాంటి వారు ప్రభుత్వ కార్యాలయాల్లో చాలా అరుదుగా కనిపిస్తుంటారు. కానీ చాలా చోట్ల ఏ చిన్న పని చేయాలన్నా వంద నుంచి లక్షల్లో లంచాలు ఆశపడేవారు ఉన్నారు. ఓ రైతు కొత్తగా నిర్మించుకున్న ఇంటికి విద్యుత్తు కనెక్షన్ ఇవ్వాలని విద్యుత్ […]