దేశంలో లంచగొండితనం ఓ భయంకర అంటువ్యాధిలా ప్రబలిపోయింది. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేవారు నెల జీతాలు తీసుకుంటున్నా.. ప్రతి చిన్నపనికి లంచం కావాలని ప్రజలను పట్టిపీడిస్తున్నారు. ఎక్కడో ఒక్కరిద్దరు మాత్రమే లంచానికి ఆశపడకుండా పనును చేస్తున్నారు. అలాంటి వారు ప్రభుత్వ కార్యాలయాల్లో చాలా అరుదుగా కనిపిస్తుంటారు. కానీ చాలా చోట్ల ఏ చిన్న పని చేయాలన్నా వంద నుంచి లక్షల్లో లంచాలు ఆశపడేవారు ఉన్నారు.
ఓ రైతు కొత్తగా నిర్మించుకున్న ఇంటికి విద్యుత్తు కనెక్షన్ ఇవ్వాలని విద్యుత్ అధికారులకు ధరఖాస్తు పెట్టుకున్నప్పటికీ.. నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అంతేకాదు తాము అడిగినంత డబ్బు ఇస్తే కనెక్షన్ ఇస్తామని డిమాండ్ చేయడంతో.. ఆ రైతు ప్రతిరోజూ విద్యుత్తు కేంద్రంలోనే వంట సామాగ్రి ఏర్పాటు చేసుకొని మిక్సీ పట్టుకుంటూ విద్యుత్తు అధికారులపై రైతు వినూత్న నిరసన వ్యక్తం తెలుపుతున్నాడు. అలా మనోడు ఆరు నెలలుగా ఇలాగే చేస్తున్నా అధికారులు ఏ మాత్రం స్పందించటం లేదు. ఈ విచిత్రమైన ఘటన కర్ణాటక శివమొగ్గ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే..
కర్ణాటకు కు చెందిన హనుమంతప్ప అనే ఒక రైతు ఇటీవల కొత్తగా ఓ ఇంటిని కట్టుకున్నాడు. కొత్తగా నిర్మించకున్న ఇంటికి విద్యుత్ కనెక్షన్ కోసం మెస్కామ్ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ హనుమంతప్ప దరఖాస్తు విషయంలో అధికార్లు నిర్లక్ష్యం వహిస్తూ వచ్చారు. పైగా కనెక్షన్ ఇవ్వాలంటే తమకు కొంత ముడుపులు ముట్టజెప్పాలని అన్నారు. వారు అడిగినంత లంచం ఇవ్వలేకపోవడంతో ఆ పని మరింత ఆలస్యం చేస్తూ వచ్చారు. తనకు వినియోగదారుల కనెక్షన్ ఇవ్వాలని అధికారులకు ఎంతగా మొరపెట్టుకున్నా వినిపించుకోలేదు.
ఇక తన ఇంట్లో కరెంట్ లేకపోవడం వల్ల వంట చేసుకునేందుకు ఇబ్బందిగా ఉందని అధికారులకు హనుమంతప్ప తెలిపాడు. దీంతో తమ కార్యాలయానికి వచ్చి చేసుకో అని ఉచిత సలహా ఇచ్చారు. ఈ నేపథ్యంలో హనుమంతప్ప వంటకు కావాల్సిన మసాలలు, ఇతర సామగ్రిని గ్రైండింగ్ చేసుకోవాలని సలహా ఇచ్చారు. ఇక చేసేదేమీ లేక ఆయన మిక్సీతో మెస్కామ్ ఆఫీసుకు వెళ్లడం గ్రాండర్ పట్టుకొని వంట చేసుకోవడం జరుగుతుంది.
ఇటీవల హనుమంతప్పకు మూమూలుగా ఇంటికి వచ్చే కలెక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత అతనికి నిరంతర జ్యోతి పథకం కింద కొత్త కనెక్షన్లు మంజూరు చేసింది ప్రభుత్వం. దీంతో ఆయన ఇంటికి ఉన్న విద్యత్ కనెక్షన్ కి ఆకస్మాత్తుగా నిలిపి వేశారు అధికారు. ఆనాటి నుంచి కొత్త కనెక్షన్ ఇవ్వకుండా జాప్యం చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో హనుమంతప్ప మాట్లాడుతూ.. ఇటీవల విద్యుత్య అధికారులకు ఎమ్మెల్యే అశోక నాయకర్ సిఫార్సు లేఖ కూడా చూపించానని.. అయినా కూడా వారు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే తాను మెస్కామ్ కార్యాలయానికి వచ్చి మిక్సీతో తనకు కావాల్సిన పనులు చేసుకొని వెళ్తున్నానని అన్నారు. తనకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
ఇక హనుమంతప్ప విషయం పై విద్యుత్ అధికారులు స్పందిస్తూ.. హనుమంతప్ప గురించి తమకు తెలిసిందని.. ఈ మద్యనే ఆయనకు ఐపి ద్వారా విద్యుత్ కనెక్షన్ ఇచ్చామని.. అదే సమయంలో ఆయనకు నిరంతర జ్యోతి కనెక్షన్ రావడంతో సమస్య మొదలైందని అన్నారు. ప్రస్తుతం ఆయనకు కొత్త లైన్ వేసేందుకు అనుమతి తీసుకున్నామని.. ఆయన సమస్యను వెంటనే తీర్చేందుకు సిద్దంగా ఉన్నామని అన్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.