ఆర్ఆర్ఆర్.. 95వ ఆస్కార్ వేడుకలలో అవార్డు అందుకొని సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆర్ఆర్ఆర్ నుండి నాటు నాటు సాంగ్ ని ఆస్కార్ వరించింది. దీంతో దేశవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ కి ఆస్కార్ రావడంపై ఆనందం వ్యక్తం చేస్తూ.. పండగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆస్కార్ అవార్డులకు సంబంధించి ఓ స్పెషల్ పిక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.