Dhanush: 1990-2010 మధ్య కాలంలో తమిళంలో టాప్ కమెడియన్‌గా వెలుగొందారు వడివేలు. హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకున్నారు. కానీ, 2010 తర్వాత సినిమాల్లో అవకాశాలు చాలా తగ్గిపోయాయి. ఇందుకు ఆయన ప్రవర్తనే కారణమని తమిళ సినీ వర్గాల వాదన. హీరోలతో కూడా ఆయన గొడవలు పెట్టుకునే వారనే ప్రచారం ఉంది. సురాజ్ దర్శకత్వంలో ధనుష్ నటించిన ‘పడికాదవన్’ సినిమా సమయంలో వడివేలుకు, ధనుష్‌కు మధ్య గొడవైందని.. ఆ గొడవ కారణంగానే వడివేలు ఆ సినిమానుంచి తప్పుకున్నారని సమాచారం. […]