మీరు మెడిసిన్ చదువాలనుకుంటున్నారా..? ఆర్థికంగా తోడ్పాటు కావాలా..? అయితే ఈ సువర్ణావకాశం మీకోసమే. వైద్య విద్యనభ్యసించే ప్రతిభావంతులకు ఆర్థిక సహకారం అందించేందుకు ఉద్ధేశించిన ‘ఆలిండియా ప్రీ మెడికల్ స్కాలర్షిప్ టెస్ట్ (సెకండరీ) 2023’ నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో అర్హత సాధిస్తే.. మీ కోర్సు పూర్తయ్యే వరకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం అందుతుంది.
నెల్లూరు ఆనందయ్య మందు తయారీ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరిశోధనను ముమ్మరం చేసింది. అందులో భాగంగా శ్రీవేంకటేశ్వర ఆయుర్వేద కళాశాల హెచ్వోడీలు, పీజీ విద్యార్థులతో ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ కమిటీ శాస్త్రీయ అధ్యయనం చేసిన అనంతరం కరోనా నివారణకు మందును తయారు చేసేందుకు టీటీడీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య కరోనాకు ఇచ్చిన ఆయుర్వేద మందును ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం, ఐసీఎంఆర్, ఆయుష్ అధికారులు పరిశీలిస్తున్న విషయం తెలిసిందే. […]