మీరు మెడిసిన్ చదువాలనుకుంటున్నారా..? ఆర్థికంగా తోడ్పాటు కావాలా..? అయితే ఈ సువర్ణావకాశం మీకోసమే. వైద్య విద్యనభ్యసించే ప్రతిభావంతులకు ఆర్థిక సహకారం అందించేందుకు ఉద్ధేశించిన ‘ఆలిండియా ప్రీ మెడికల్ స్కాలర్‌షిప్ టెస్ట్ (సెకండరీ) 2023’ నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో అర్హత సాధిస్తే.. మీ కోర్సు పూర్తయ్యే వరకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం అందుతుంది.
డాక్టర్ చదువులు ఎంత ఖర్చుతో కూడుకున్నావో అందరికీ విదితమే. చెల్లించాల్సిన వార్షిక ఫీజు పక్కన పెడితే.. మొదట సీటు కోసం డొనేషన్ పేరిట లక్షలకు లక్షలు సమర్పించాలి. ఈ భయంతోనే సాధారణ, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన పిల్లలు డాక్టర్ చదువులకు దూరంగా ఉంటారు. అలాంటి వారి కోసం తీసుకొచ్చిందే.. ఈ ‘ఆలిండియా ప్రీ మెడికల్ స్కాలర్‌షిప్’. దేశవ్యాప్తంగా వైద్య విద్యనభ్యసించే ప్రతిభావంతులకు ఆర్థిక సహకారం అందించేందుకు ఉద్ధేశించిన ‘ఆలిండియా ప్రీ మెడికల్ స్కాలర్‌షిప్ టెస్ట్ (సెకండరీ) 2023’ నోటిఫికేషన్ వెలువడింది.
ఈ పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా విద్యార్థులకు విడివిడిగా స్కాలర్‌షిప్ లు అందిస్తారు. ఎంబీబీఎస్ సహా డెంటల్, హోమియో, యునానీ, ఆయుర్వేద విభాగాల్లో మెడికల్ డిగ్రీ కోర్సులు చేసే అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్/ పన్నెండోతరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై వారు ఈ స్కాలర్‌షిప్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలు రాసినవారు ఇందుకు అర్హులే. ఈ స్కాలర్‌షిప్ కు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
విద్యార్హతలు: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్/ పన్నెండోతరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై వారు, ప్రస్తుతం చివరి సంవత్సర పరీక్షలు రాసిన వారు అర్హులు. దీంతో పాటు ‘నీట్’లో అర్హత సాధించి గుర్తింపు పొందిన వైద్య కళాశాలలో ప్రవేశం పొంది ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్థులు తప్పనిసరిగా 1997 అక్టోబరు 1 తరవాత జన్మించి ఉండాలి.
స్కాలర్‌షిప్ వివరాలు: ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్ పొందినవారికి కోర్సుకు 16,000 మందికి చొప్పున మొత్తం 80,000 మందికి స్కాలర్‌షిప్ లు అందిస్తారు. అలాగే, ప్రైవేట్ కాలేజీల్లో చేరిన 94,600 మందికి స్కాలర్‌షిప్ లు అందిస్తారు.
ప్రభుత్వ కాలేజీల్లో చేరిన వారికి..
ఇక ప్రైవేట్ కాలేజీల్లో చేరిన వారికి..
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1450 చెల్లించాల్సి ఉండగా, మహిళలు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1250 చెల్లించాలి. దీనికి జిఎస్ టీ అదనం.
పరీక్షా విధానం: ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో మొత్తం 200 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్ ప్రొఫిషియెన్సీ అండ్ లాజికల్ రీజనింగ్ పై ఒక్కో విభాగంలో 50 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు చొప్పున మొత్తం మార్కులు 800 కేటాయించారు. నెగటివ్ మార్కింగ్ విధానం ఉంది. అంటే తప్పు సమాధానాలకు కోత విధిస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15.04.2023
అడ్మిట్ కార్డ్స్ డౌన్‌లోడ్ తేదీ: 28.05.2023
పరీక్షలు జరుగు తేదీ: 10, 12,14, 16 జూన్ 2023
పలితాలు వెలువడే రోజు: 20.06.2023