ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. కొంతమంది సోషల్ మీడియాలో స్టార్లు కావటానికి అష్టకష్టాలు పడుతున్నారు.. ఇతరుల్ని పెడుతున్నారు. తాము ఏం చేసైనా సరే లైకులు, అభిమానుల్ని పొందాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పిచ్చిపిచ్చి పనులు చేస్తున్నారు. కొద్దిరోజులు క్రితం ఇండియాకు చెందిన ఓ ఇన్స్టాగ్రామ్ స్టార్ గుడి మెట్ల మీద డ్యాన్స్ చేసి ఇబ్బందుల పాలైంది. తాజాగా, ఓ యువతి కూడా అతి పురాతనమైన పిరమిడ్పై డ్యాన్స్ చేసి జనం ఆగ్రహానికి గురైంది. […]