సెకండ్ వేవ్ రూపంలో దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు అంతమవుతుందా అని ప్రతి ఒక్కరూ ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. రోజూ లక్షల మందికి వ్యాపిస్తూ వేల సంఖ్యలో ప్రాణాలు బలితీసుకొంటున్న ఈ మహమ్మారి నుంచి కాపాడాలంటూ ప్రజలు దేవుడిని ప్రార్థిస్తున్నారు. ఇప్పటికే అనేక ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో పూజలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులోని కోయంబత్తూరు శివారులో కరోనా దేవి ఆలయం నిర్మించడం చర్చనీయాంశంగా మారింది. ఈ మహమ్మారి బారి నుంచి ప్రజల్ని రక్షించాలని […]