మంగళవారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. కర్ణాటకకు చెందిన ట్రాన్స్‌జండర్ బీ మంజమ్మ జోగటికి పద్మశ్రీ పురస్కారం వరించింది. అవార్డు అందుకునేందుకు వచ్చిన మంజమ్మ వాళ్ల సంప్రాదాయం ప్రకారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు తన కొంగుతో దిష్టి తీసింది. ఈ సంఘటన అవార్డు కార్యక్రమం మొత్తానికే హైలెట్‌గా నిలిచింది. కాగా ప్రస్తుతం మంజమ్మ రాష్ట్రపతికి దిష్టితీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా మంజమ్మ కర్ణాటక రాష్ట్ర […]