హైదరాబాద్- తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించాక తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రేవంత్ రెడ్డిని ముందు వ్యతిరేకించిన కాంగ్రెస్ సీనియర్ నేతలంతా మెల్లమెల్లగా మనసు మార్చుకుంటున్నారు. అధిష్టానం నిర్ణయానికి తలొంచక తప్పదని తెలుసుకుంటున్నారు. ఐతే ఇదే సమయంలో కొంత మంది నేతలు రేవంత్ నాయకత్వాన్ని ఎదురించి కాంగ్రెస్ ను వీడుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సోదరుడు కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా […]