Mahinda Rajapaksa: శ్రీలంక దేశం గత కొన్ని నెలలుగా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అల్లాడిపోతున్న సంగతి తెలిసిందే. సంక్షోభానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ప్రధాని మహింద రాజపక్సపై విపక్షాలు, సొంత పార్టీలోని నేతలు ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం ప్రధాని పదవికి మహింద రాజపక్స రాజీనామా చేశారు. రాజపక్సతో పాటు మరో ఆరుగురు మంత్రులు తమ పదవికి రాజీనామా చేశారు. రాజీనామాకు కొన్ని గంటల ముందు దేశ అధ్యక్షుడి నివాసంలో అధ్యక్షుడు గోటబయ రాజపక్స, […]