Mahinda Rajapaksa: శ్రీలంక దేశం గత కొన్ని నెలలుగా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అల్లాడిపోతున్న సంగతి తెలిసిందే. సంక్షోభానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ప్రధాని మహింద రాజపక్సపై విపక్షాలు, సొంత పార్టీలోని నేతలు ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం ప్రధాని పదవికి మహింద రాజపక్స రాజీనామా చేశారు. రాజపక్సతో పాటు మరో ఆరుగురు మంత్రులు తమ పదవికి రాజీనామా చేశారు. రాజీనామాకు కొన్ని గంటల ముందు దేశ అధ్యక్షుడి నివాసంలో అధ్యక్షుడు గోటబయ రాజపక్స, ప్రధాని మహింద రాజపక్సల నేతృత్వంలో స్పెషల్ క్యాబినేట్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్‌లో దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవటానికి ప్రధాని మహింద రాజపక్స బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సిందిగా క్యాబినేట్ నిర్ణయం తీసుకుంది.
అంతేకాదు! ప్రస్తుత క్యాబినేట్ కూడా రద్దయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, శ్రీలంక సంక్షోభానికి బాధ్యత వహిస్తూ అధ్యక్షుడు గోటబయ రాజపక్స రాజీనామా చేయాలంటూ గత కొద్దిరోజులుగా నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. సోమవారం అధ్యక్ష భవనం ముందు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ మద్దతుదారులు వీరిపై దాడులు చేశారు. దీంతో 20 మంది దాకా నిరసనకారులు గాయపడ్డారు. మరి, శ్రీలంక సంక్షోభానికి బాధ్యత వహిస్తూ ప్రధాని రాజీనామా చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Elon Mask: నేను చనిపోవచ్చు. వైరల్ అవుతన్న ఎలాన్ మస్క్ ట్వీట్!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.