టాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమాల హవా పెరుగుతూనే ఉంది. శర్వానంద్, సిద్ధార్థ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మహాసముద్రం’. ఈ సినిమాకి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు. ‘RX 100’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన అజయ్ మూవీ కావడంతో మహాసముద్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా ఓ అపురూప ప్రేమ కథ అంటోంది యూనిట్. ఈ సినిమాలో అదితిరావు హైదర్, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. […]