అమరావతి- ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంటూ, మూడు రాజధానుల రద్దు బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన జగన్ సర్కార్, మరో కీలక బిల్లును రద్దు చేసుకునేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. శాసనమండలి రద్దు తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించినట్లు సమాచారం. గతంలో శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ తీర్మానాన్ని ఉపసంహరించుకుంటూ మరో కొత్త తీర్మానాన్ని తెచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. […]