నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన “వరుడు కావలెను” మూవీ ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య మీడియాతో ముచ్చటించారు. నేను పుట్టింది కర్నూలు జిల్లాలో అయినా పెరిగిందంతా గుంటూరు జిల్లా నరసరావు పేట. మా నాన్న మ్యాథ్స్ లెక్చరర్. 11 ఏళ్లకే పదో తరగతి ఎగ్జామ్ రాశాను. చిన్నప్పటి నుంచి గుంపులో కలిసిపోవడం కాకుండా నలుగురిలో ఒకరిలా ఉండటం ఇష్టం. అందుకే సినిమా ఇండస్ట్రీ నాకు కరెక్ట్ అనిపించింది. […]