తూర్పుగోదావరి- ఒక్కోసారి ఎదుటివారికి సాయం చేయబోయి మనం చిక్కుల్లో పడతాం. మామూలు చిక్కులైతే పరవాలేదు కానీ, ప్రాణాల మీదకు వస్తే.. అవును తూర్పుగోదావరి జిల్లాలో ఒకరి ప్రాణాలు కాపాడబోయి, మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మృతుడి కుటుంబంలో విషాదం నింపింది. ఈ దారుణ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది. ముమ్మిడివరం నగర పంచాయతీకి చెందిన గ్రామ వాలంటీర్ పెదపూడి లక్ష్మీకుమారి, అన్నంపల్లి అక్విడెక్ట్ పై నుంచి గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. […]