మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ హుజురాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు గెలుపు గుర్రాల వేటలో తలమనకలవుతున్నాయి. ఒక పక్కఈటెల బీజేపీలో చేరి పాదయాత్రతో ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టాడు. వరుస సమావేశాలతో ప్రజలతో మమేకమవుతూ రాజకీయంగా దూకుడు పెంచుతున్నారు. ఇక ప్రధానంగా హుజురాబాద్ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నారు సీఎం కెసిఆర్. ఎలాగైనా ఈటెలకు చెక్ పెట్టి, ఓడించాలని కంకణం […]