ఇటీవల చాలా మంది చిన్న విషయాలకే మనస్థాపానికి గురి అవుతున్నారు. కొన్నిసార్లు చిన్న విషయాలే చిలికి చిలికి గాలివానగా మారి ఎదుటి వారిపై దాడులకు పాల్పపడటం.. ప్రాణాలు తీసే స్థాయికి వెళ్తున్నారు. ప్రతిరోజూ ఇలాంటి సంఘటనలు ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి.
జైపూర్‌లోని భంక్రోత నుంచి సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. ఒక కోడలు తన అత్తగారిని కత్తితో పొడిచి చంపేసింది. 62 ఏళ్ల అత్తగారు మోహనీ దేవి తన కోడలను కూరగాయలు కోయమని కోరింది. ఇద్దరి మధ్య గొడవ బాగా పెరిగింది, కోడలు మమత కూరగాయలు కోస్తున్న కత్తి, ఆమె అత్తగారిని 26 దెబ్బలు కొట్టి తీవ్రంగా గాయపరిచింది. ఇది మాత్రమే కాదు, మమత తన అత్తగారిని అటువంటి స్థితిలో వదిలేసి, బ్యాగ్‌తో పరారైన కోడలు మమతను పోలీసులు […]