ఇటీవల చాలా మంది చిన్న విషయాలకే మనస్థాపానికి గురి అవుతున్నారు. కొన్నిసార్లు చిన్న విషయాలే చిలికి చిలికి గాలివానగా మారి ఎదుటి వారిపై దాడులకు పాల్పపడటం.. ప్రాణాలు తీసే స్థాయికి వెళ్తున్నారు. ప్రతిరోజూ ఇలాంటి సంఘటనలు ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి.
ఈ మద్య చిన్న చిన్న వివాదాలే పెద్దగా మారిపోయి ఎదుటి వారిపై దాడులు.. ప్రాణాలు తీసే స్థాయికి వెళ్తున్నాయి. రోడ్డు పై వ్యాపారం చేసుకునేవాళ్లకు ట్రాఫిక్ పోలీసులకు అప్పుడప్పుడు గొడవలు జరగడం సహజం. రూల్స్ ని అతీక్రమించి వ్యాపారం చేస్తున్నారన్న ఆరోపణలపై ట్రాఫిక్ పోలీసులు వారిని అడ్డుకునే సమయంలో గొడవలు జరుగుతుంటాయి. తాజాగా ఇలాంటి వివాదమే ఒకటి కాకినాడలో జరిగింది. ఈ ఘటనలో బ్రేక్ ఇనస్పెక్టర్‌పై కొబ్బరిబోండా కత్తితో దాడి చేశాడు వ్యాపారి. దీంతో బ్రేక్ ఇన్స్ పెక్టర్ వేలు కూడా తెగిపోయింది. వివరాల్లోకి వెళితే..
కాకినాడలో ఓ వ్యక్తి వ్యాన్ లో కొబ్బరి బోండాలు తీసుకు వచ్చి అమ్ముతున్నాడు. అదే సమయంలో అక్కడికి బ్రేక్ ఇన్స్‌పెక్టర్ వచ్చి వ్యాన్ కి లైసెన్స్ ఉందా అని అడిగాడు. కొద్ది సేపు కొబ్బరిబోండాలు అమ్ముకొని వెళ్తాను.. పరిమిషన్ ఇవ్వండి అని ఆ వ్యాపారి అడిగాడు. తాను వెహికిల్ లైసెన్స్ అడిగితే పొంతన లేని సమాధానాలు చెప్పడంతో వ్యాపారిపై బ్రేక్ ఇన్స్‌పెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ఇద్దరి మద్య గొడవ మొదలై బ్రేక్ ఇన్స్‌పెక్టర్‌పై ఆ వ్యాపారి కొబ్బరిబోండాలు నరికే కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో బ్రేక్ ఇన్స్‌పెక్టర్ చేతి వేలు కూడా తెగిపోయింది. స్థానికుల సహాయంతో బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం బ్రేక్ ఇన్స్‌పెక్టర్ పరిస్థితి బాగానే ఉందని.. వేలు తెగిన చోట చికిత్స అందించినట్లు వైద్యులు తెలిపారు. చిన్న కారణంతోనే విచక్షణ కోల్పోయి కొబ్బరి బోండాల వ్యాపారి దారుణంగా బ్రేక్ ఇన్స్‌పెక్టర్ పై దాడి చేయడంపై స్థానికులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ మద్య కాలంలో చాలా మంది చిన్న విషయాలకే సహనం కోల్పోయి ఎదుటి వారిపై దాడులకు తెగబడుతున్నారు.