మకర సంక్రాంతి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పండగ శోభ వెల్లివిరుస్తోంది. సంక్రాంతికి పిల్లాపెద్ద అంతా స్వగ్రామాలకు చేరుకుని ఇంటిల్లిపాది ఆనందంగా గడుపుతున్నారు. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు కావడంతో ఇళ్లన్నీ పిల్లలతో కళకళాడుతున్నాయి. మూడ్రోజులపాటు జరుపుకునే ఈ పండగలో మొదటిరోజు భోగి, రెండో రోజు మకర సంక్రాంతి, మూడో రోజు కనుమ అని అందరికీ తెలిసిందే. మొదటిరోజు భోగి మంటలు వేసుకుని తలార స్నానం చేసి సూర్యభగవానుడిని పూజిస్తారు. పిల్లలకు భోగి పండ్లు పోస్తారు. ఇక ముఖ్యమైనది రెండో […]