యాదాద్రి- తెలంగాణలోని యాదాద్రి లక్ష్మీనారసింహ స్వామి ఆలయ పున:ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. యాదాద్రి ఆలయ పున: ప్రారంభ తేదీని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. 28 మార్చి 2022న యాదాద్రిలో మహా కుంభ సంప్రోక్షణతో ఆలయ పున:ప్రారంభోత్సవానికి ముహూర్తం నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. మహా సంప్రోక్షణకు 8 రోజుల ముందు నుంచీ సుదర్శన యాగం నిర్వహిస్తామని తెలిపారు. కనీవినీ ఎరుగని రీతిలో మొత్తం పది వేల మంది రుత్విక్కులతో యాగం నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మంగళవారం యాదాద్రి […]