హాలీవుడ్ సినిమాలలో బోల్డ్ నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులందరికీ 'టైటానిక్' మూవీ తెలిసే ఉంటుంది. దాదాపు ఈ సినిమా గురించి తెలియని వారుండరు అనుకోండి. ఈ సినిమా వచ్చి 25 ఏళ్ళు పూర్తయిన క్రమంలో.. రీసెంట్ గా మరోసారి వరల్డ్ వైడ్ రీ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా కేట్ మీడియాతో మాట్లాడుతూ పలు క్రేజీ విషయాలు షేర్ చేసుకుంది.