హాలీవుడ్ సినిమాలలో బోల్డ్ నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులందరికీ 'టైటానిక్' మూవీ తెలిసే ఉంటుంది. దాదాపు ఈ సినిమా గురించి తెలియని వారుండరు అనుకోండి. ఈ సినిమా వచ్చి 25 ఏళ్ళు పూర్తయిన క్రమంలో.. రీసెంట్ గా మరోసారి వరల్డ్ వైడ్ రీ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా కేట్ మీడియాతో మాట్లాడుతూ పలు క్రేజీ విషయాలు షేర్ చేసుకుంది.
కొన్నిసార్లు నటీనటులు కెరీర్ లో ఫేస్ చేసిన విషయాలు చెబుతుంటే ఓవైపు ఆశ్చర్యంగాను, మరోవైపు షాకింగ్ గా అనిపిస్తాయి. పెళ్లయ్యాక హీరోయిన్స్ రొమాంటిక్ సన్నివేశాలలో నటిస్తే ఇండియాలో కామెంట్స్ చేస్తారేమో గాని.. హాలీవుడ్ లో అలా కాదు. హాలీవుడ్ కల్చర్ గురించి తెలుసు కదా! ఎలాంటి బోల్డ్ సన్నివేశాలైనా నిర్మొహమాటంగా తెరపై చూపించేస్తుంటారు. అలాగే నటీనటులు కూడా అభ్యంతరం లేకుండా సన్నివేశాలలో నటిస్తుంటారు. వారికి నటనే అయినప్పటికీ.. ఇండియన్ ప్రేక్షకులకు ఇలాంటివి చాలా పెద్ద ఇష్యూస్. ఎందుకంటే.. హాలీవుడ్ సినిమాలలో ఆడ, మగ తారతమ్యాలు ఏమి ఉండవు.. ఆ సినిమాలు కూడా ఇండియన్ సినిమాలను మించి ఓపెన్ అప్ అయ్యుంటాయి.
ఇక హాలీవుడ్ సినిమాలలో బోల్డ్ నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులందరికీ ‘టైటానిక్’ మూవీ తెలిసే ఉంటుంది. దాదాపు ఈ సినిమా గురించి తెలియని వారుండరు అనుకోండి. జేమ్స్ కామరూన్ తెరకెక్కించిన ఈ అద్భుత ప్రేమకావ్యం 1997లో విడుదలై చెరగని ముద్ర వేసింది. ఈ సినిమా వచ్చి 25 ఏళ్ళు పూర్తయిన క్రమంలో.. రీసెంట్ గా మరోసారి వరల్డ్ వైడ్ రీ రిలీజ్ చేశారు. కాగా.. టైటానిక్ స్పెషల్ షోలో దర్శకుడు జేమ్స్ కామరూన్ తో పాటు హీరో లియోనార్డో డికాప్రియో, కేట్ విన్ స్లేట్ పాల్గొంది. ఈ సందర్భంగా లియోనార్డో డికాప్రియో, కేట్ మీడియాతో మాట్లాడుతూ పలు క్రేజీ విషయాలు షేర్ చేసుకున్నారు.
టైటానిక్ తర్వాత డికాప్రియో, కేట్ కలిసి 2008లో ‘రెవల్యూషనరీ రోడ్’ అనే సినిమా చేశారు. ఆ సినిమాని కేట్ మాజీ భర్త సామ్ మెండిస్ రూపొందించారు. ఈ సినిమాలో డికాప్రియోతో కలిసి పలు బోల్డ్ సన్నివేశాలలో నటించింది కేట్. భర్త డైరెక్షన్ లోనే హీరోతో అలా బోల్డ్ సీన్స్ చేసేసరికి చాలా ఇబ్బందిగా ఫీలయ్యానని చెప్పింది ఈ బ్యూటీ. కేట్ మాట్లాడుతూ.. “రివల్యూషనరీ రోడ్ మూవీ టైంలో సెకండ్ టైమ్ డికాప్రియోతో కలిసి నటించడం ఆనందంగా అనిపించింది. ఆ సినిమాకి డైరెక్టర్ నా భర్తే కాబట్టి.. డికాప్రియోతో బోల్డ్ సన్నివేశాలలో నటించేటప్పుడు ఓవైపు ఇబ్బందిగా, మరోవైపు విచిత్రంగా ఫీలయ్యాను” అని తెలిపింది. ఆ సినిమాకి కేట్ బెస్ట్ యాక్ట్రెస్ గా గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకుంది. కాగా.. ప్రెసెంట్ కేట్ మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి టైటానిక్ సినిమా గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.