సంగారెడ్డి క్రైం- మహిళలు, ఆడపిల్లలు బయటకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. పిల్లలను ఎక్కడికైనా పంపాలంటేనే కుటుంబ సభ్యులు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. రోజు రోజుకు పెరిగిపోతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలే ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. మొన్న హైదరాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన మరువక ముందే మరో దారుణం చోటుచేసుకోబోయింది. కానీ అదృష్టావశాత్తు దుర్మార్గుల నుంచి ఆ పాప తప్పించుకుంది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. గణేశ్ నిమజ్జనం చూపిస్తామని […]