చెన్నై- కరోనాతో పోరాడి మనలను మనమే కాపాడుకోవాలని ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్హాసన్ అన్నారు. కరోనా కారణంగా ఊహించని విధంగా జీవితాలు మారాయని ఆయన విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కరోనా మహమ్మారి నుంచి తప్పించుకునేందుకు స్వీయరక్షణ పాటించాల్సిన తరుణం ఆసన్నమైందని కమల్ హాసన్ అన్నారు. తాను కరోనా టీకా రెండు డోస్లు వేసుకున్నానని, తనను ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని ఆయన చెప్పారు. ఎలాంటి భయాందోళనలు లేకుండా కరోనా […]