Jubilee Hills Case: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు నిందితుల పోలీసు కస్టడీ మంగళవారంతో ముగిసింది. పోలీసుల విచారణలో నిందితులు పలు కీలక విషయాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. రోజూలాగే మంగళవారం నాటి విచారణలోనూ పలు కీలక విషయాలు వెల్లడించారు. అత్యాచారం ఎక్కడ జరిగింది?.. ఇందుకు ఉసిగొల్పింది ఎవరు? అన్న విషయాలను పోలీసులు ఆరా తీశారు. జూబ్లీహిల్స్‌లోని ఓ గుడి వెనుకాల ఉన్న నిర్మానుష ప్రదేశంలో బాలికపై అత్యాచారం జరిపినట్లు నిందితులు చెప్పారు. ఒకేచోట అందరూ కలిసి […]