Jubilee Hills Case: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు నిందితుల పోలీసు కస్టడీ మంగళవారంతో ముగిసింది. పోలీసుల విచారణలో నిందితులు పలు కీలక విషయాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. రోజూలాగే మంగళవారం నాటి విచారణలోనూ పలు కీలక విషయాలు వెల్లడించారు. అత్యాచారం ఎక్కడ జరిగింది?.. ఇందుకు ఉసిగొల్పింది ఎవరు? అన్న విషయాలను పోలీసులు ఆరా తీశారు. జూబ్లీహిల్స్‌లోని ఓ గుడి వెనుకాల ఉన్న నిర్మానుష ప్రదేశంలో బాలికపై అత్యాచారం జరిపినట్లు నిందితులు చెప్పారు. ఒకేచోట అందరూ కలిసి అత్యాచారానికి పాల్పడినట్లుగా వెల్లడించారు.
ప్రభుత్వ వాహనం అని రాసి ఉన్న ఇన్నోవా కారును పథకం ప్రకారమే తీసుకొచ్చామని, ఆ కారుకు బ్లాక్ ఫిలిం ఉండటమే కాకుండా గవర్నమెంట్ వెహికిల్ అని ఉంటే ఎవరూ టచ్ చేయరన్న ఉద్దేశంతో దాన్ని ఎంపిక చేసుకున్నామని తెలిపారు. ముందస్తు పథకంలో భాగంగానే కండోమ్ ప్యాకెట్లు కూడా తీసుకొచ్చిమన్నారు. పోలీసు కస్టడీలో మైనర్లందరూ కూడబలుక్కున్నట్లుగా ఒకే సమాధానం చెప్పారు. పోలీసు కస్టడీ ముగియగానే మంగళవారం సాయంత్రం ఈ ఐదుగురు మైనర్లను జువనైల్ హోంకు తరలించారు.
కాగా, గత విచారణలో నిందితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ‘ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాక ఖాళీగానే ఉంటూ.. రోజూ పబ్ కి వెళ్తున్నాం. మేము మైనర్లం కాబట్టి మాకు పబ్ లోకి ఎంట్రీ ఉండదు. అందుకే వేరే వాళ్లతో పార్టీలు ఏర్పాటు చేయించి.. బిల్ మేమే కడతామంటూ ఆ పార్టీలకు వెళ్తున్నాం. పబ్ కి వచ్చే బాలికలను ట్రాప్ చేయాలని ముందే నిర్ణయించుకున్నాం. ఇద్దరు అమ్మాయిలను చూశాక..
డేట్ రామని అడుగుదాం అనుకున్నాం. అసలు వాళ్లు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దామని తప్పుగా బిహేవ్ చేశాం. వాళ్లకు భయంవేసి వెంటనే బయటకు వెళ్లిపోయారు. ఇద్దరిలో ఒక అమ్మాయి క్యాబ్ బుక్ చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. రెండో అమ్మాయిని ముందుగా నిర్ణయించుకున్నట్లే మాయ మాటలు చెప్పి మా ట్రాప్ లో పడేశాం. ప్లాన్ ప్రకారమే ఆమెను కారులో ఎక్కించుకుని అత్యాచారానికి పాల్పడ్డాం’ అని తెలిపారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Woman: భర్త వేధింపులు తట్టుకోలేక దారుణమైన నిర్ణయం తీసుకున్న భార్య!