జీవితంలో కొందరికి చివరి ప్రయత్నం వరకు మంచిరోజులు రావు. మరికొందరికి మొదటి ప్రయత్నంలోనే అదృష్టం వరిస్తుంది. రాత్రికి రాత్రే కోటీశ్వరులవుతారు. ఒక్కసారిగా జీవితం మారిపోతుంది. అలాంటి ఘటన ప్రవాస భారతీయుడికి జరిగింది.
దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్‌లో ఓ భారతీయుడు జాక్‌పాట్ కొట్టాడు. గణేష్ షిండే అనే భారత వ్యక్తి 1 మిలియన్ డాలర్లు గెలుచుకున్నాడు. దీంతో షిండే రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. మిలీనియం మిలియనీర్ సిరీస్ 363లో భాగంగా షిండే కొనుగోలు చేసిన లాటరీ టికెట్ నెం.0207కు ఈ జాక్‌పాట్ తగిలింది. 36 ఏళ్ల షిండే నావికుడిగా పనిచేస్తున్నారు. దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్‌లో ఒక మిలియన్ డాలర్లు గెలవడం నిజంగా చాలా సంతోషంగా ఉందని, ఈ నగదులో […]