తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన జీవో రద్దు చేయాలని కోరుతూ బండి సంజయ్ చేపట్టిన దీక్షను భగ్నం చేసిన పోలీసులు… ఆయన్ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అనంతర పరిణామాలు వివాదాస్పదంగా మారాయి. బెయిల్ పై విడుదలైన బండి… తనకు అవమానం జరిగిందని జాతీయ స్థాయిలో ఫిర్యాదులు చేశారు. దీనిపై పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీ ఇప్పటికే విచారణ చేపట్టింది. ఈ క్రమంలో బండి ఫిర్యాదు మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, హోంశాఖ […]
ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీల కోసం సర్కారు జారీ చేసిన జీవో 317ను సవరించాలనే డిమాండ్‌తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన జాగరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. కరెంటు సరఫరాను నిలిపివేసి, కిటికీల నుంచి ఫైరింజన్‌తో నీళ్లు చల్లి, ఎంపీ కార్యాలయ ద్వారాన్ని బద్దలు కొట్టి సంజయ్‌ని అరెస్టు చేశారు. బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన అనంతరం మానకొండూరుకు పోలీసులు తరలించారు. అక్కడి నుంచి పీటీఎస్‌కు సంజయ్ తరలించారు. ఈ నేపథ్యంలో […]