అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం తెచ్చిన అభివృద్ధి వికేంద్రీకరణకు క్రమంగా మద్దతు పెరుగుతోంది. విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని ఏర్పాటు, అభివృధి వికేంద్రీకరణకు మద్దతుగా జేఏసీ ఏర్పాటైంది. అంబేద్కర్ వర్సిటీ మాజీ ఉప కులపతి హనుమంతు లజపతిరాయ్ కన్వీనర్‌గా జేఏసీని ఏర్పాటు చేశారు. అందులో ప్రొఫెసర్లు, డాక్టర్లు, లాయర్లు, జర్నలిస్టులు సహా ఎన్జీవోల ప్రతినిధులు సభ్యులుగా ఉన్నారు. మేధావులు, ప్రముఖులతో ఏర్పడిన ఈ జేఏసీ సైతం అభివృద్ధి వికేంద్రీకరణకు ఆమోదం తెలిపింది. అంతేకాకుండా […]
ఆంధ్రప్రదేశ్ లో పీఆర్సీ రగడ కొనసాగుతుంది. పీఆర్సీ సాధన ఉద్యమ కార్యాచరణలో భాగంగా గురువారం నుంచి నాలుగు రోజుల పాటు స్థానిక ఏపీఎన్జీవో హోమ్ వద్ద రిలేనిరాహార దీక్ష చేపట్టనున్నట్టు ఉద్యోగ సంఘ నాయకులు తెలిపారు. విజయవాడ ధర్నా చౌక్ లో రిలే దీక్షలో రాష్ట్ర నేతలు పాల్గొననున్నారు. రిలే నిరాహార దీక్షల్లో ఉద్యోగులు పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నామని జేఏసీ నేతలు చెప్పారు. ప్రతి రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష […]