స్టార్ పూరీ జగన్నాథ్ మూవీ కెరీర్ రిస్కులో పడినట్లు కనిపిస్తోంది. మరోసారి ఆ హీరోనే నమ్ముకున్నట్లు అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ విషయమే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఇండస్ట్రీలో ప్రకటించిన సినిమాలన్నీ తెరమీదకు రాకపోవచ్చు. ఒక్కోసారి కొన్ని అనౌన్స్ మెంట్ వద్దే ఆగిపోతుంటాయి.. మరికొన్ని షూటింగ్ ప్రారంభించే ముందు, ఇంకొన్నింటికీ స్క్రిప్ట్ దశలోనే బ్రేక్ పడుతుండటం చూస్తూనే ఉంటాం. ఇవన్నీ సినీ ఇండస్ట్రీలో చాలా కామన్. అయితే.. అనౌన్స్ మెంట్ తర్వాత తెరమీదకు రావాల్సిన సినిమాలు ఎప్పుడు ఆగిపోయాయి? అని కాకుండా ఎందుకు ఆగిపోయాయి? అనేది చర్చనీయాంశంగా మారుతుంది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జనగణమన’ మూవీ విషయంలో ఇలాంటి చర్చలే జరుగుతున్నాయి. డాషింగ్ […]