భారత్‌లో కోవిడ్ వీర విహారం చేస్తోంది. ఐపీఎల్ 2021కీ కరోనా సెగ తగలకూడదని బయోబబుల్‌లో ఆటగాళ్లను ఉంచి ఎన్ని జాగ్రత్తులు తీసుకున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి కరోనా సంక్షోభం కారణంగా ఈ లీగ్‌ను బీసీసీఐ అనూహ్యంగా వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ సైమన్ డౌల్ తన దేశానికి తిరిగి పయనమవుతూ భారత ప్రజలను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశాడు. ఈ విపత్కర సమయాల్లో భారత ప్రజలు సురక్షితంగా ఉండాలని సూచించాడు. దేశ ప్రజల పట్ల తనకున్న కృతజ్ఞతను డౌల్ తన ట్వీట్ రూపంలో […]
స్పోర్ట్స్ డెస్క్- కరోనా మహమ్మారి అంతకంతకు విస్తరిస్తోంది. ఐతే కరోనా ముషుల మీదే కాదు క్రికెట్ పైనా కాటు వేస్తోంది. కొవిడ్ సమయంలో క్రికెట్ ప్రేమికులకు మంచి వినోదాన్ని అందిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఐపీఎల్ కరోనా కాటుకు బలైంది. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు చెందిన చాలా మంది ఆటగాళ్లకు కరోనా సోకింది. దీంతో ఆటగాళ్లు ఒక్కొక్కరుగా మ్యాచ్ నుంచి తప్పుకుంటున్నారు. ఈ పరిణామాలన్నింటినీ సమీక్షించిన బీసీసీఐ వెంటనే అప్రమత్తమైంది. ఇంతటితో ఈ సీజన్‌కు ఫుల్ స్టాప్ పెట్టాలని […]