సాఫ్ట్‌వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ తన ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ సేవలకు ఇక చెల్లుచీటీ ఇస్తున్నట్లు వెల్లడించింది. వచ్చే ఏడాది అంటే 2022 జూన్ 15వ తేదీ నుంచి ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ సేవలను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ చరిత్రలో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ది ప్రత్యేక స్థానం. ప్రజలకు అంతర్జాలాన్ని దగ్గర చేసిన ఘనత దీనికే దక్కుతుంది. ఇప్పుడు అది కాలగర్భంలో కలిసిపోనుంది. వెబ్ బ్రౌజర్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ను నిలిపివేయాల్సిన సమయం ఆసన్నమైందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. దశలవారీగా దీని సేవలను నిలిపివేస్తామని పేర్కొంది. […]