పాకిస్తాన్భూభాగంలోకి దూసుకెళ్లిన ఇండియా మిస్సైల్‌పై ఇరు దేశాల మధ్య ఆందోళన నెలకొంది. అసలే భారత్-పాకిస్తాన్ మధ్య ఉప్పు-నిప్పుగా సాగే వ్యవహారాల్లో ఇప్పుడు ఈ మిసైల్ మిస్ ఫైర్ అంశం కొత్త వివాదం రేపుతోంది. మార్చి 9న భారత్‌కి చెందిన సూపర్-సోనిక్ ఫ్లయింగ్ క్షిపణి సూరత్‌గఢ్ నుంచి పాకిస్తాన్ భూభాగంవైపు దూసుకుపోయిన సంగతి తెలిసిందే. ఈప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆ సమీపంలోని గోడ మాత్రం ధ్వంసమైంది. దీనిపై భారత రక్షణ శాఖ ఇప్పటికే వివరణ ఇచ్చింది. […]