కన్న కొడుకు ప్రయోజకుడు అయ్యి.. ఉన్నత స్థానంలో ఉంటే.. అంతకు మించి ఓ తల్లికి కావాల్సింది ఏముంటుంది చెప్పండి. పైగా తన కొడుకు దేశం గర్వించే స్థాయికి ఎదిగితే ఆ తల్లికి అంతకన్నా పుత్రోత్సాహాం మరోటి ఉండదు. ప్రస్తుతం అలాంటి పుత్రోత్సాహాన్నే పొందుతోంది మహ్మద్ సిరాజ్ తల్లి. బుధవారం న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించిన సంగతి మనకు తెలిసిందే. ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు లోకల్ బాయ్ మహ్మద్ సిరాజ్. […]