ప్రస్తుతం సినీ ప్రేక్షకులంతా కేజిఎఫ్-2 గురించే మాట్లాడుకుంటున్నారు. రాకింగ్ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరినీ, వారి నటనని విశేషంగా కొనియాడుతున్నారు ప్రేక్షకులు. యష్, హీరో తల్లి, సంజయ్ దత్, రవీనా టాండన్ పాత్ర ఇలా సినిమాలోని ప్రముఖ పాత్రలందర్నీ ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. అయితే వీరందరితో పాటు కేజీఎఫ్ కథలో కీలకమైన పాత్ర ఇంకోటి ఉంది. […]