ప్రస్తుతం సినీ ప్రేక్షకులంతా కేజిఎఫ్-2 గురించే మాట్లాడుకుంటున్నారు. రాకింగ్ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరినీ, వారి నటనని విశేషంగా కొనియాడుతున్నారు ప్రేక్షకులు. యష్, హీరో తల్లి, సంజయ్ దత్, రవీనా టాండన్ పాత్ర ఇలా సినిమాలోని ప్రముఖ పాత్రలందర్నీ ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. అయితే వీరందరితో పాటు కేజీఎఫ్ కథలో కీలకమైన పాత్ర ఇంకోటి ఉంది.
అదే ఇనాయత్ ఖలీల్. కథని మలుపు తిప్పే ఈ పాత్రలో నటించింది మన తెలుగువారే. టాలీవుడ్ కి చెందింది ఆదర్శ్ బాలకృష్ణ తండ్రి బాలకృష్ణ నీలకంఠాపురం.. ఇనాయత్ ఖలీల్ పాత్రలో నటించారు. అయితే.. ఈయనకు ఇదే మొదటి సినిమా కావడం విశేషం. ఈ క్రమంలో తాజాగా బాలకృష్ణ గారు ఓ ఇంటర్వ్యూలో భాగంగా కేజీఎఫ్-3 గురించి మాట్లాడారు. ప్రస్తుతం ఆయన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కేజీఎఫ్-3 ఉంటుందని సినిమా చివరిలో క్లారిటీ ఇచ్చారు. కాబట్టి సినిమాలో అందరు విలన్స్ చనిపోయారు ఒక్క ఇనాయత్ ఖలీల్ తప్ప. సో పార్ట్-3 లో మీరే మెయిన్ విలన్ అని మాకు అనిపిస్తుంది. దీనిపై మీరేమంటారు? అని అడిగిన ప్రశ్నకు.. “అదేం నాకు తెలియదు. నన్ను ఎలాంటి కాంట్రవర్సిలోకి లాగకండి. అందరూ చూసినట్లే నేను కూడా చూసాను. కేజీఎఫ్-3 అనేది నాకు లాస్ట్ లో సరిగ్గా కనబడలేదు. నాకిప్పుడు పార్ట్-3 అనేది ఇమేజిన్ చేసుకున్నారా లేక నిజంగానే చూశారా? అనే డౌట్ వస్తుంది” అంటూ బాలకృష్ణ సమాధానం ఇచ్చారు. మరి ఈ వీడియో చూసి కేజీఎఫ్-3 పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.