ఒమైక్రాన్ కేసులు పెరుగుతుండడం.. పండుగల నేపథ్యంలో కొవిడ్ వ్యాప్తిపై కేంద్ర ప్రభుత్వం సైతం హెచ్చరికలు చేయడంతో రాష్ట్రాలు అందుకు తగినట్లుగా సిద్ధమవుతున్నాయి. ఒక్కొక్కటిగా ఆంక్షలను విధిస్తున్నాయి. దేశంలో ఒమిక్రాన్ ఎఫెక్ట్ ఎక్కువగా మహారాష్ట్ర తో పాటు దేశ రాజధానిపైనే పడింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలను విధించాలని నిర్ణయం తీసుకుంది. ఈమేరకు రాష్ట్రంలో మరోసారి నైట్ కర్ఫ్యూ విధించింది. రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ అమలు చేయనున్నారు. […]