దేశ వ్యాప్తంగా వినాయక చవితి పండగను ఎంతో ఘనంగా నిర్వహించుకున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో సైతం గణేశ్ పండుగను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. బొజ్జ గణపయ్యకు నవ రాత్రులు విభిన్నమైన పూలతో అలకరించి, భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో కొన్నిచోట్లు గణేషుడి నిమజ్జనం కూడా ప్రారంభమైంది. భక్తులు గణనాధుడిని గంగమ్మ ఒడిలో చేరుస్తోన్నారు. అయితే హిమాయత్ నగరలో నిమజ్జననోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. 20 అడుగుల భారీ వినాయకుడు నిమజ్జనానికి తరలి వెళ్తోన్న […]
వినాయక నిమజ్జనంపై తీర్పును సవరించేందుకు హైకోర్టు నిరాకరించింది. జీహెచ్ఎంసీ రివ్యూ పిటిషన్ పై ఏసీజే జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ వినోద్ కుమార్‌ల ధర్మాసనం అత్యవసరంగా విచారణ చేపట్టింది. పరిస్థితులను అర్థం చేసుకుని తీర్పు సవరించాలని ప్రభుత్వ న్యాయవాది కోర్టును కోరారు. కానీ పరిస్థితులన్నీ సర్కారు సృష్టించుకున్నవేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. సమస్యను గుర్తించి పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులదని కోర్టులది కాదని స్పష్టం చేసింది హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం సమాలోచనలో పడింది, ఎందుకంటే ఇప్పటికే ట్యాంక్ బండ్ లో […]
వినాయక చవితి నేపథ్యంలో ఆవు పేడతో తయారు చేసిన వినాయక విగ్రహాలకు డిమాండ్ పెరిగింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరానికి చెందిన కాంత యాదవ్ ఆవుపేడతో పర్యావరణ అనుకూల వినాయక విగ్రహాలు తయారు చేశారు. హిందూ సంస్కృతితో ఆవుపేడను పవిత్రంగా భావిస్తుంటారు. అందుకే ఎండిన ఆవుపేడతో కలప దుమ్ము, మైదా పొడి కలిపి మిశ్రమాన్ని వినాయకుడి అచ్చులో పోసి విగ్రహాన్ని తయారు చేశామని 15 నిమిషాల్లోనే తయారు చేసిన ఈ విగ్రహాలు ఆరబెట్టడానికి నాలుగైదు రోజులు పడుతోంది. […]