హైదరాబాద్- ప్రపంచాన్ని కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది. అంతకంతకు విజృంభిస్తూ మానవాళిని వణికిస్తోంది. ఇప్పటి వరకు కేవలం మనుషులకు, జంతువులకు మాత్రమే సోకుతున్న కరోనా.. ఇప్పుడు నీళ్లను కూడా వదలడం లేదు. అవును నీళ్లలో కూడా కరోనా ఆనవాళ్లను గుర్తించారు నిపుణులు. అది కూడా మన హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ లో. అవును మీరు విన్నది నిజమే. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సే న్ సాగర్‌లో కరోనా జన్యుపదార్థాల ఆనవాళ్లు ఉన్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. […]